
ఇందూరు అక్షరలక్ష్మి అభినందనీయం
నిజామాబాద్‌అర్బన్: స్వయం సహాయక సంఘా ల్లోని సభ్యుల విద్యార్హతలను గుర్తించడంతోపాటు నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించాలనే సంకల్పంతో ‘ఇందూరు అక్షరలక్ష్మి’ యాప్ రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. సంపూర్ణ అక్షరాస్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సెర్ప్, తెలంగా ణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సమగ్ర శిక్ష, వయోజన విద్యా శా ఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇందూరు అక్షరలక్ష్మి’ పేరుతో రూపొందించిన యాప్‌ను ఐడీవోసీ కార్యాలయ కాన్ఫరెనన్స్‌హాల్‌లో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని స్వయం సహాయక సంఘాల్లో సు మారు 3.40 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారని, సీసీలు, వీవోఏల సహాయంతో ప్రతి ఎస్‌హెచ్‌జీ సభ్యుల విద్యా సంబంధిత వివరాలను సేక రించి ఇందూరు అక్షరలక్ష్మి యాప్‌లో నమోదు చే యడం జరుగుతుందన్నారు. అక్షరాస్యతా కేంద్రాలను ఏ ర్పాటు చేసి వలంటీర్ల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారని, అదేవిధంగా పదో తరగతి లోపు చదువుకున్న వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాయించడం, ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన వారిని ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయించడం జరుగుతుందని తెలిపారు. గణాంకాల ప్రకారం జిల్లాలో మహిళల అక్షరాస్యత 55 శాతంగా ఉందని, సంపూర్ణ అక్షరాస్యత కార్యక్ర మం అమలు ద్వారా నూటికి నూరు శాతం మహిళా అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం పూర్తి సహకార మందిస్తామన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ రవీందర్, డీఈవో అశోక్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీఎంహెచ్‌వో రాజశ్రీ, వయోజన విద్యా సంయుక్త సంచాలకులు గోవింద్‌రావు, స్వయం సహాయక మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారి యాప్ రూపకల్పన
ఆవిష్కరించిన కలెక్టర్
రాజీవ్ గాంధీ హనుమంతు
సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం
సమష్టిగా కృషి చేయాలని సూచన