ఫుట్‌పాత్‌లను ఆక్రమించొద్దు
ఖలీల్‌వాడి: నగరంలోని దుకాణదారులు, తోపుడు బండ్ల వారు రోడ్డును, ఫుట్‌పాత్‌లను ఆక్రమించవద్దని ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ సూచించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ దుకాణ సముదాయాల నిర్వాహకులతో తోపుడు బండ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఒకటవటౌన్ పీఎస్ నుంచి గంజిగేట్–1, దేవి రోడ్డు వరకు ఫుట్‌పాత్‌లను ఆక్రమణ ఎక్కువగా ఉంటోందని వెంటనే దానిని మార్చుకోవాలని సూచించారు. దుకాణ యజమానులు వారి దుకాణాలలోనే వ్యాపారం నిర్వహించుకోవాని, తోపుడు బండ్ల వారు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో దుకాణదారులు, తోపుడు బండ్ల వారు పాల్గొన్నారు.


