అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
భిక్కనూరు: మండలంలోని మోటాట్‌పల్లి గ్రామంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై అంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారు వారు విలేకరులతో మాట్లాడారు. మోటాట్‌పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు తన సమీప బంధువువైన మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో తన తమ్ముడు శివకుమార్‌కు పెళ్లి సంబంధాలు రావడంలేదు. అలాగే ఖరీఫ్ పంటకు సంబంధించిన డబ్బులను రాజు దుబార చేస్తున్నాడు. దీంతో అన్నపై కోపంతోనే హత్య చేసినట్టు తమ్ముడు ఒప్పుకున్నాడు. ఈమేరకు నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ,ఎస్సైలు వివరించారు.


