అప్పులు తీసుకునేప్పుడు జాగ్రత్త!
మీకు తెలుసా..
రామారెడ్డి: చట్టబద్ధంగా (లీగల్‌గా) అప్పు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మోసాలు జరగకుండా అనవసరమైన వేధింపులు లేకుండా జాగ్రత్తపడవ చ్చు. మీరు అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
● సాధారణంగా ఆర్‌బీఐ గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వంటి వాటి నుంచి రుణాలు తీసుకోవచ్చు.
● చిన్న మొత్తంలో రుణాలను ఎన్‌బీఎఫ్‌సీ(బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఆర్‌బీఐ గు ర్తింపు పొందిన ప్రయివేట్ సంస్థలు రిజిస్టర్డ్ మైక్రోఫైనాన్‌న్స్ సంస్థల ద్వారా పొందవచ్చు.
● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు, ప్రయివేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటే, వారికి ప్రభుత్వం ఇచ్చిన ‘మనీ లెండింగ్ లైసెనన్స్’ ఉందో లేదో సరిచూసుకోవాలి.
● అప్పు తీసుకునేటప్పుడు కేవలం మాటల మీద ఆధారపడకుండా పత్రాలను సిద్ధం చేసుకోవాలి
● ప్రామిసరీ నోట్ అప్పు తీసుకున్నట్లు, తిరిగి చెల్లిస్తానని రాసి ఇచ్చే పత్రం. దీనిపై రెవె న్యూ స్టాంపు ఉండాలి.
● లోన్ అగ్రిమెంట్ వడ్డీ రేటు, చెల్లింపు గడువు, ఆలస్యమైతే జరిమానా వంటి వివరాలన్నీ ఇందులో ఉండాలి.
● భద్రత కోసం బ్యాంకులు లేదా సంస్థలు పోస్ట్ డేటెడ్ చెక్కులు అడుగుతాయి.
● వడ్డీ రేటు చట్టం ప్రకారం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయడం నేరం. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
● వ్యక్తిగత రుణాలకు వడ్డీ సాధారణంగా ఏడాదికి 10.5% నుంచి 24% వరకు ఉండవచ్చు.
● బంగారు రుణాలు ఏడాదికి 8% నుంచి 15% వరకు ఉంటాయి.
● గృహ రుణాలు ఏడాదికి 8.5% నుంచి 11% మధ్యలో ఉంటాయి.
● వ్యాపార రుణాలు ఏడాదికి 12% నుంచి 18% వరకు ఉండవచ్చు.
● ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేశాయి.
● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు.
● సాధారణంగా ఇది ఏడాదికి 12% నుంచి 18% మించకూడదని నిబంధనలున్నాయి.
● ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరుతో ఎంత కట్ అవుతుందో ముందే అడగండి.
● మీరు గడువు కంటే ముందే అప్పు తీర్చేయాలనుకుంటే ఏవైనా పెనాల్టీలు ఉంటాయో తెలుసుకోవాలి.
● ఆన్‌లైన్ లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో చాలా ఫే క్ లోన్ యాప్‌లు ఉన్నాయి. ఆర్‌బీఐ ద్వారా గుర్తింపు పొందిన యాప్‌లలోనే అప్పు తీసుకోవాలి.
● మీ ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీకి అనుమతి అడిగే యాప్‌లకు దూరంగా ఉండండి.
● ఎప్పుడూ ఖాళీ పేపర్ల మీద లేదా ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయకండి.
● మీరు చెల్లించే ప్రతి రూపాయికి రసీదు అడగండి. లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారానే చెల్లింపులు చేయండి.
● అప్పు తీసుకునేటప్పుడు సాక్షుల సంతకాలు ఉండేలా చూసుకోండి.


