టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం
మోపాల్: హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం విజ్ఞాన దర్శని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా, జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్ కేతావత్ యాదగిరి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించారు. నాయకులు వెంకట్రాం, రవి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఉత్తర తిరుపతి దేవస్థానంలో ఈనెల 30న వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 29న అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వాగత సభా కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం అన్నదానం ఉంటుందని వివరించారు. 30న ఉదయం 11 గంటలకు శ్రీ చక్రపూజ, సంపూర్ణ భగవద్గీత పారాయణం, 12 గంటలకు అనుగ్రహ భాషణం, సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 7 గంటలకు సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం, అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.


