
కళాశాలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: బోధన్‌లోని ఓ కళాశా లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు డీఐఈవో రవికుమార్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్, నగర కార్యదర్శి సునీల్,బాలకృష్ణ మాట్లాడుతూ.. బోధన్ లో ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించినా ఆ కళాశాల ఇంటర్ బోర్డుకు ఎగ్జామ్ ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయలేదన్నారు. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కళాశాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సాయి, మనోజ్, కిరణ్, అజయ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల నిలువల తనిఖీ
సిరికొండ: మండలంలోని సొసైటీల్లో ఎరువుల నిలువలను తహసీల్దార్ రవీందర్‌రావు, ఏవో నర్సయ్య శనివారం తనిఖీ చేశారు. ఖరీఫ్‌లో ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటల సాగు విస్తీర్ణం, ఎరువుల గోదాంల సామర్థ్యం, పంటల సాగు కు కావాల్సిన ఎరువులు ఎంత అవసరం పడతాయి, సొసైటీల్లో ఎంత స్టాక్ ఉంది అనే వివరాలను పరిశీలించినట్లు ఏవో తెలిపారు. సిరికొండ, తూంపల్లి సొసైటీల్లో, గడ్కోల్ సేల్ పాయింట్‌లో 31 మెట్రిక్ టన్నుల యూరియా, 48 మెట్రిక్ టన్నుల డీఏపీ, 74 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
కవిత లేఖను సమర్థిస్తున్నాం
నిజామాబాద్‌నాగారం: ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు రాసిన లేఖను తాము సమర్థిస్తున్నామని నిజామాబాద్ రూరల్ బీఆర్‌ఎస్ నాయకుడు బాదావత్ రమేశ్ నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కవిత బీఆర్‌ఎస్ పటిష్టత కోసం ఎంతో కృషి చేస్తున్నారని, నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పా లనపై ప్రశ్నిస్తున్నారని అన్నారు. మహిళా రిజ ర్వేషన్ విషయంలో,అసెంబ్లీలో అంబేడ్కర్ వి గ్రహం విషయంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ని ఎప్పటికప్పుడు ఎండ కడుతున్నారని అన్నా రు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖలో మంచి వా లెబుల్ పాయింట్స్ ఉన్నాయన్నారు. అధికారం పోయాక కేసీఆర్ చుట్టూ ఉన్న కోవర్టులను గుర్తించాలని కింది స్థాయి కార్యకర్తను కూడా గుర్తించాలని కవిత లేక రాసిందని అన్నారు. పార్టీ పటిష్టత కోసమే కవిత లేక రాశారని వీటి ని తమ అధినేత కేసీఆర్ గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. కవిత కు తా ము అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు డీకొండ సుధీర్, శ్రీనివాస్ గుప్తా,బి పరుశురాంనాయక్,నాయకులు పాల్గొన్నారు.
పహల్గాం ఘటనపై
విచారణ చేపట్టాలి
నిజామాబాద్ సిటీ: పహల్గాంలో పర్యాటకుల హత్యలు, ఆపరేషన్ సిందూర్‌లో దాగి ఉన్న నిజాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు వాస్తవాలు వివరించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో శనివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. కాశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డవారిని కేంద్ర ప్రభుత్వం పట్టుకోలేదని, ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌తో యుద్ధం మధ్యలోనే నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లొంగిపోయి మోకరిల్లినట్లుగా ఉందన్నారు. నాయకులు పరుచూరి శ్రీధర్, భూమన్న, నీలం సాయిబాబా, సూర్య శివాజీ, గౌతం కుమార్, శివకుమార్, సత్యం, మార్క్స్, బాలయ్య, మల్లికార్జున్, సాయినాథ్, లక్ష్మి, సంజన, గోపాల్, సంజీవ్, మోహన్, నర్సింగరావు పాల్గొన్నారు.

కళాశాలపై చర్యలు తీసుకోవాలి

కళాశాలపై చర్యలు తీసుకోవాలి

కళాశాలపై చర్యలు తీసుకోవాలి