
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఉల్లబోయిన గంగారాం(56)కు ముగ్గురు కుమారులు. వీరు బతుకుదెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గ్రామంలో గంగారాం ఒక్కడే నివాసం ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కారు ఢీ కొని ఇద్దరికి గాయాలు
మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తాలో శుక్రవారం టీ తాగుతున్న ఇద్దరు యువకులను మహారాష్ట్ర నుంచి వేములవాడ వెళ్తున్న కారు ఢీకొన్నది. ఈ ఘటనలో యువకులకు గాయాలు కాగా రోడ్డు పక్కన పార్క్ చేసిన నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి. స్థానికులు గాయపడ్డ యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య