
నిందితుడి రిమాండ్
ఖలీల్‌వాడి: పాత కక్షలతో ఒకరిపై దాడి చేసిన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన దోమల సాయికుమార్‌కు కన్నిగిడె సాయికుమార్ అలియాస్ సాయినాథ్‌కు పాత కక్షలు ఉన్నాయి. ఈ నెల 20న నగరంలోని బోధన్ రోడ్డులో ఉన్న మైఫిల్ హోటల్ వద్ద కనిపించిన సాయికుమార్‌పై సాయినాథ్ కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
వడ్ల లారీ బోల్తా
లింగంపేట: మండలంలోని బూరుగిద్ద శివారులోని మూల మలుపు వద్ద శుక్రవా రం వడ్ల లారీ బోల్తా పడిననట్లు గ్రామస్తులు తెలిపారు. లింగంపేట మండలం అయిలాపూర్‌లో ధాన్యం లోడ్ చేసుకొని చిట్యాలలోని రైస్ మిల్లుకు వెళ్తుండగా బూరుగిద్ద వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.