
ఘనంగా చర్చి వార్షికోత్సవం
డిచ్‌పల్లి: మండలంలోని సీఎస్‌ఐ వెస్లీ చర్చి 10వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాస్టర్ జి.దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నిజామాబాద్ ప్రెసిబిటర్ సీహెచ్ జార్జి ముఖ్య ప్రసంగం చేశారు. సంఘంలో దేవుని పిల్లలు సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వర్ధిల్లాలని, విశ్వాసులు తమ హృదయాలను ఆలయంగా మార్చుకుని దేవుని ఆరాధించాలని సూచించారు. చర్చిపై సీ్త్రల మైత్రి సభ్యులు ప్రత్యేక గీతం ఆలపించారు. వేడుకల్లో రెవరెండ్ బి.ప్రకాశ్, రెవరెండ్ బి.ప్రవీణ్, పాస్టర్ రాజు, పెద్దలు సామేల్, పద్మారావు, దేవరాజ్, భూమయ్య, ప్రవీణ్, మోహన్, సీమెన్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.