
మాల మహానాడు మండల కమిటీ ఏర్పాటు
మాక్లూర్: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కా దేవిదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని మాణిక్‌భండార్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్‌లో మాల మహానాడు మాక్లూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బేగరి రవి, కార్యదర్శిగా నీరడి శంకర్, కోశాధికారిగా డీసీ గంగాధర్, ఉపాధ్యక్షులుగా తిర్మన్‌పల్లి భోజన్న, ఆసది ఒడ్డెన్న, బి.రవిని ఎన్నుకున్నారు. కులస్తులందరి అభిప్రాయం తీసుకుని సంఘ అభివృద్ధికి పాటు పడుతామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, చింతల మోహన్, భోజన్న, రవి, ఎం.గోపాల్ పాల్గొన్నారు.