అన్నదాతలు ఆందోళన చెందొద్దు
బాల్కొండ: వర్షాల వల్ల ధాన్యం తడిసిన అన్నదాతలు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ బా ల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముప్కాల్ మండలం నల్లూర్‌లో వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఽధైర్యంగా ఉండాలన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగో లు చేస్తుందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇది వరకే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు తగవన్నారు. కమ్మర్‌పల్లి మార్కె ట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, తదితరులున్నారు.


