
మారుతి మందిర్ దుకాణాల లీజ్‌కు వేలంపాట
బోధన్‌రూరల్: పట్టణంలోని మారుతి మందిర్ కాంప్లెక్స్‌లో గల దుకాణాల లీజ్‌కు దేవదాయ ధర్మదాయ శాఖఽ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. మారుతి మందిర్ కాంప్లెక్స్‌లోని రెండు దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు వేలంపాట నిర్వహించగా 5వ నెంబర్ దుకాణాన్ని కాళిదాసుచారి రూ.7,100లు, 6వ నెంబర్ దుకాణాన్ని బొప్పాపురం హన్మాండ్లు రూ.7,200లు నెలవారీ అద్దెతో అత్యధికంగా వేలంపాట ద్వారా దక్కించుకున్నట్లు ఈవో రాములు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గుండెటి శంకర్, ఇన్‌స్పెక్టర్ కమల, ఈవో రాములు, పట్టణాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారి, అర్చకులు ప్రవీణ్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.