
ధర్పల్లి తహసీల్దార్‌గా శాంత
ధర్పల్లి: ధర్పల్లి నూతన తహసీల్దార్‌గా టి. శాంత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు తహసీల్దార్‌గా పనిచేసిన మాలతి మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చందూర్ తహసీల్దార్‌గా పనిచేసిన శాంత ధర్పల్లికి బదిలీపై వచ్చారు. మండలంలో భూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. రైతులకు ఎలాంటి భూ సమస్యలున్నా తనను సంప్రదించాలని ఆమె సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఆర్‌ఐ రాజేశ్వర్, రవి, సిబ్బంది తహసీల్దార్‌కు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డుల ప్రదానం
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్, బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రులను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ షా శుక్రవారం సందర్శించారు. అనంతరం అత్యున్నత సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. లయనన్స్ క్లబ్(ఇందూరు) రాష్ట్ర అదనపు కార్యదర్శి కరిపే రవీందర్ కూడా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కరిపే రవీందర్ మాట్లాడుతూ.. తనకు అవార్డు అందించిన మనోజ్ షా, బాబూరావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బసవేశ్వర్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ సభ్యులు కొడాలి కిశోర్, శ్రీనివాస రావు, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
అహ్మదీబజార్‌లో ట్రాఫిక్ క్లియర్
ఖలీల్‌వాడి: నగరంలోని రెండవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మదీబజార్‌లో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. నగరంలోని ఆహ్మదీబజార్‌లో రోడ్డు దగ్గరగా ఉండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్లు, కోకాలను లోపలికి జరిపించారు. వాహనదారులు, షాపులకు వచ్చేవారికి ఇబ్బందులు తొలిగించామని ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.
రిటైర్డ్ ఆర్టీవో శివచరణ్‌కు నివాళులు
ఖలీల్‌వాడి: నగరంలోని గాజులపేట్‌కు చెందిన రిటైర్డ్ ఆర్టీవో, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం మాజీ అధ్యక్షుడు శివచరణ్ మృతి పట్ల మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శివచరణ్ ఇంటి వద్ద ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. శివచరణ్‌తో చిన్ననాటి జ్ఞాపకాలు ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
వెకేషన్ బైబిల్ స్కూల్
ప్రారంభం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి(ఆచన్‌పల్లి)లో శుక్రవారం వెకేషన్ బైబిల్ స్కూల్‌ను చర్చి ఫాదర్ రెవరెండ్ ప్రభాకర్ ప్రారంభించారు. వెకేషన్ బైబిల్ స్కూల్ రెండు రోజులపాటు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ఫాదర్ తెలిపారు. ఈ స్కూల్‌లో పిల్లలకు బైబిల్‌లోని ఏసు బోధనలు నేర్పించడంతో పాటు ఆటలు, పాటలు, వివిధ సాంస్కతిక కార్యమాలు నేర్పిస్తామని వెల్లడించారు. ఫాదర్ స్టీఫెన్, పాస్టర్ రవి, చర్చి కమిటీ ప్రతినిధులు జ్యోతిరాజ్, ఎడ్వర్డ్, సీమాన్, సంపత్ పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో రికార్డుల తనిఖీ
బోధన్‌రూరల్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శుక్రవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని వారికి సూచించారు. రాజీవ్ యువవికాస్ పథకంలో లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలన్నారు. హరితహారంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు బాల గంగాధర్, మధుకర్ పాల్గొన్నారు.

ధర్పల్లి తహసీల్దార్‌గా శాంత

ధర్పల్లి తహసీల్దార్‌గా శాంత

ధర్పల్లి తహసీల్దార్‌గా శాంత