
లోతైన దుక్కులతో తెగుళ్ల నివారణ
నవీపేట: లోతైన దుక్కులతో పంటలను ఆశించే తెగుళ్లను నివారించవచ్చని రుద్రూర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. వేసవిలో లోతైన దుక్కులతో నేలతో సంక్రమించే పురుగులను నాశనం చేయవచ్చని వివరించారు. వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులోనే యూరియా, ఎరువులను వాడాలని సూచించారు. విత్తన శుద్ధి ప్రాధాన్యతను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త పద్మావతి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏవో నవీన్‌కుమార్, వెటర్నరీ వైద్యులు నరేందర్‌రెడ్డి, ఏఈవోలు సుప్రియ, వినోద్, వసంత్, అపూర్వ, రైతులు తదితరులు పాల్గొన్నారు.