
ప్రజల గుండెల్లో రాజీవ్‌గాంధీ
నిజామాబాద్ సిటీ: దేశ మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో రాజీవ్‌గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి ఎమ్మెల్యేతోపాటు నా యకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అ నంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లకు ఓటుహక్కును కల్పించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా చేశారన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాదక్షుడని కొనియాడారు. జాతీ య విద్యా విధానం అమలు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రపథాన నడిపారన్నారు. 40 ఏళ్లకే ప్రధానమంత్రి పదవిని చేపట్టి యువ ప్రధానిగా చరిత్రలో నిలిచారన్నారు. ఆయన భౌతికంగా లేకపో యినా ఆయన ఆశించిన సమాజం వాస్తవ రూపంలో కనిపిస్తోందన్నారు. రాజీవ్‌గాంధీ ఆలోచనలతో యువత ముందుకు వెళ్లాలన్నారు. వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి రామ్‌భూపాల్, యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గోపి, నాయకులు వేణురాజ్, నరేందర్‌గౌడ్, సేవాదళ్ సంతోష్, కోనేరు సాయికుమార్, బొబ్బిలి రామకృష్ణ, బోర్గాం శ్రీనివాస్, పోల ఉష, పుప్పాల విజయ, సుభాష్ జాదవ్, సలీం, అవిన్, సాయిలు, యెండల కిషన్, నికిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతకు రాజకీయ
అవకాశాలు కల్పించారు
ఐటీ రంగంలో విప్లవాత్మక
మార్పులు తెచ్చారు
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే
సుదర్శన్‌రెడ్డి