
తీగ లాగితే డొంక కదులుతోంది
నిజామాబాద్‌నాగారం: ‘విధులకు డుమ్మా.. రిజిస్ట ర్‌లో సంతకాలు’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం వైద్యారోగ్యశాఖలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సీరియస్ కావడంతో జిల్లా వైద్యాధికారులతోపాటు రా ష్ట్ర అడ్మినిస్ట్రేటీవ్ డైరెక్టర్ శశిశ్రీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన సిరికొండ పీహెచ్‌సీలో విచారణ చేపట్టి నివేదికతో వెళ్లారు. ‘సాక్షి’ కథనం ద్వారా తీగ లాగితే డొంక కదులుతోంది. ఒక్కోక్కటిగా అ క్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి.
మౌనంపై అనుమానాలు
పీహెచ్‌సీని తనిఖీ చేసేందుకు నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ రెండు నెలల్లో నాలుగుసార్లు వెళ్లారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ఎవరెవరు లీవ్‌లో ఉన్నారు, హాజరు, గైర్హాజరు, ఈఎల్, సీఎల్ తదితర వాటిని రికార్డుల్లో పరిశీలించి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఓ అధికారి ఆరు నెలలపాటు సిక్ లీవ్‌లో ఉంటే జిల్లా వైద్యాధికారి అనుమతి ఉండాలి, ఒకవేళ అనుమతి ఉన్నా తిరిగి విధుల్లో చేరేందుకు సైతం ఉన్నతాధికారి అనుమతించాల్సి ఉంటుంది. అయితే పలుమార్లు తనిఖీలకు వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌వో అటెండెన్స్ రిజిస్టర్‌ను ఎందుకు పరిశీలించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిరికొండ పీహెచ్‌సీలో అక్రమాలెన్నో..
ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వైనం
ఇష్టారాజ్యం
సిరికొండ పీహెచ్‌సీ ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. కొందరు అసలే విధులకు హాజరుకాకపోగా, మరికొంత మంది ఇలా వచ్చి అలా వె ళ్తుండగా, ఇంకొంత మంది రాకున్నా అటెండెన్స్ రిజిస్టర్‌లో దర్జాగా సంతకాలు చేస్తున్నారు. పీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్‌సీ మార్చి, ఏప్రిల్ నెలల్లో సక్రమంగా విధులకు హాజరుకాకున్నా రిజస్టర్‌లో సంతకాలు చేసి జీతం పొందినట్లు తెలిసింది. సెక్షన్‌లో పైఅధికారికి ప్రతి నెలా సుమారు రూ.20వేల వరకు కమీషన్ ఇవ్వడంతోనే దర్జాగా జీతాలు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సిక్ లీవ్‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆ తరువాత జిల్లా ఉన్నతాధికారికి తెలియకుండానే విధుల్లోకి చేరినట్లు తెలిసింది.

తీగ లాగితే డొంక కదులుతోంది