ప్రైవేట్ స్కూళ్ల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్‌అర్బన్: ప్రైవేట్ పాఠశాలల స మస్యలను పరిష్కరించాలని ట్రస్మా నాయకులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి జయసింహగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రైవే ట్ స్కూల్ ఫీ రెగ్యులేటర్ కమిటీ పొందుపర్చిన అంశాల్లో ఇబ్బందులను తొలగించాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు రాస నిత్యానందం, జిల్లా సెక్రెటరీ గోజూరి అరుణ్, రాష్ట్ర అడ్వైజర్ మామి డాల మోహన్, అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు, సెక్రెటరీ శ్రీనివాస్, నర్సాగౌడ్, పృథ్వి, మైనారిటీ ప్రెసిడెంట్ ఇక్బాల్ ఖాన్, మహమ్మద్ కైఫ్, ముజాహిద్ రహమాన్, జాకీర్ హుస్సేన్ తదితరులున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూ ల్ స్కీం కోసం ఆసక్తి ఉన్న ప్రైవేట్ పాఠశాల లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తులను ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు..
నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ విద్యార్థులు ఇంటర్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి నిర్మల ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వ సతి గృహాల్లో చదివి, పదో తరగతిలో 7.0 జీపీఏ, ఆపై జీపీఏ సాధించినవారు అర్హుల ని తెలిపారు. ఈనెల 31వ తేదీలోగా దర ఖాస్తు చేసుకోవాలని, అనంతరం ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
నేడు ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’
ఖలీల్‌వాడి: ప్రయాణికుల సమస్యలను తె లుసుకోవడంతోపాటు వారి సలహాలు, సూ చనలను స్వీకరించేందుకు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్‌ఎం జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కొనసాగుతుందని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
డిగ్రీ పరీక్షల్లో
508 మంది గైర్హాజరు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం మూడో రోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో 7,680 మంది విద్యార్థులకు 7,172 మంది హాజరు కాగా 508 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 7,112 మంది విద్యార్థులకు 6,670 మంది హాజరు కాగా 442 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 558 మంది విద్యార్థులకు 502 మంది హాజరుకాగా 66 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
సేంద్రియ సాగుపై శిక్షణ
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో గ్రా మీణ యువ రైతులకు సేంద్రియ వ్యవసా యంపై నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ భరత్ కు మార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్ 1వరకు శిక్షణ ఇస్తామని.. ఉచి త వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నా రు. పదో తరగతి ఉత్తీర్ణులైన యువ రైతులు ఈ నెల 23వ తేదీలోగా కలెక్టరేట్‌లోని ఆత్మ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో 15 మందిని ఎంపిక చేసిన శిక్షణ ఇస్తామని, వివరాలకు 94406 87698ను సంప్రదించాలన్నారు.
రీజినల్ మేనేజర్ 99592 26011
ఆర్మూర్ డిపో 99592 26019
బోధన్ డిపో 99592 26001
నిజామాబాద్ డిపో1 99592 26016
నిజామాబాద్ డిపో 2 99592 26017
కామారెడ్డి డిపో 99592 26018
బాన్సువాడ డిపో 99592 26020


