
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్ అర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో నిర్వహించిన సోమవారం చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటర్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పరీక్షాకేంద్రంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సెంటర్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత తమ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో హాల్ టికెట్లు తీసుకోలేని వారు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావొచ్చని స్పష్టం చేశారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ లేకపోయినా విద్యార్థులను అనుమతించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనకమహాలక్ష్మి, ఖిల్లా బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ఖాళిక్ పరీక్షల నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు. సమావేశంలో 36 పరీక్షాకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు రాయనున్న 18,837 మంది విద్యార్థులు
ఈనెల 22 నుంచి ప్రారంభం
జిల్లా ఇంటర్ విద్యాధికారి
తిరుమలపూడి రవికుమార్