సమస్యల పరిష్కారానికే మీడియేషన్ సెంటర్లు
ఖలీల్‌వాడి/నిజామాబాద్‌నాగరం: సమస్యల పరిష్కార మార్గమే సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రం ప్రధాన ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భర త లక్ష్మి అన్నారు. నగరంలోని దుబ్బ రోడ్డులో ఉన్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో, మారుతినగర్‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పా టు చేసిన మీడియేషన్ సెంటర్లను న్యాయమూర్తి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కొంత మంది తటస్థ వ్యక్తులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఒక్కో సెంటర్‌లో ఐదుగురు చొప్పున కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు ఉంటారని తెలిపారు. మీడియేషన్ సెంటర్ల ద్వారా సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి ఉదయ్‌భాస్కర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్‌రెడ్డి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, డీఎల్‌ఎస్‌ఎ సూపరిటెండెంట్ శైలజ, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


