
మనం సైతం దేశం కోసం..
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ర్యాలీ కన్వీనర్ కృపాకర్‌రెడ్డి తదితరులు
భారత సైన్యానికి మద్దతుగా ‘మనం సైతం దేశం కోసం’ అంటూ నగరవాసులు సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సాయుధదళాలకు గౌరవ సూచకంగా నిర్వహించిన ర్యాలీకి భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి నినాదాలు మారుమోగాయి. సర్వీస్‌మెన్లు, సైనికులు ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. – సుభాష్‌నగర్

మనం సైతం దేశం కోసం..