
భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సాయిచైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే స్టేషన్‌లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 22 మంది ఏఎస్సైలు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లతోపాటు 2018 నుంచి ఇప్పటి వరకు బదిలీకాని 116 మంది కానిస్టేబుళ్లకు స్థాన చలనం కలిగింది. సీపీగా సాయిచైతన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి. సిబ్బందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం బదిలీ ప్రక్రియను చేపట్టారు. అలాగే విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సిబ్బందిని దూరప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. గతంలో సీపీగా పనిచేసిన నాగరాజు 90 మందికి పైగా కానిస్టేబుళ్లను బదిలీ చేశారు.
22 మంది ఏఎస్సైలు..
26 మంది హెడ్ కానిస్టేబుళ్లు
116 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సాయిచైతన్య

భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ