నారాయణ కళాశాల విద్యార్థిని రియాకు 319
ప్రతిభచాటిన ఎస్‌ఆర్, కాకతీయ విద్యార్థులు
నిజామాబాద్‌అర్బన్: టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం వెలువడగా, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్త మ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ వి భాగంలో నగరంలోని నారాయణ జూనియ ర్ కళాశాల విద్యార్థిని పంచమహల్కర్ రియా 319వ ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ విభాగంలో ఎస్‌ఆర్ కళాశాలకు చెంది న కార్తీక్ 572, విష్ణువర్ధన్ 689వ ర్యాంకులు సాధించారు. అలాగే ఉత్తమ ప్రతిభచాటిన కాకతీయ కళాశాల విద్యార్థులను సంస్థ డైరెక్టర్ రామోజీరావు ఘనంగా సన్మానించారు.
గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్
ఆర్‌సీవో గంగారాం నాయక్
ఇందల్వాయి : రీజియన్ పరిధిలోని మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని గిరిజ న సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025 –26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ ఎన్ గంగారాం నాయక్ ఒక ప్ర కటనలో తెలిపారు. మెదక్, చేగుంట, నర్సాపూర్, కోనాపూర్, ఎల్లారెడ్డి, హన్మాజీపేట, ఇందల్వాయి బాలికల జూనియర్ కళాశాల లో ఎంపీసీ, బైపీసీ సీట్లు, నర్సాపూర్‌లో సీ ఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉ న్నాయన్నారు.
కౌడిపల్లి, నాగిరెడ్డిపేట, చీమన్‌పల్లి బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సీట్లు, బాన్సువాడలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపా రు. మొదట గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకులు