
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్: మండలంలోని మంచిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008–09 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు.. ఆత్మీయంగా పలకరించుకొని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు.
ముగిసిన వాలీబాల్ శిక్షణ శిబిరం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ డీటీవో ఉమా మహేశ్వర్ రావు, ఆదిలాబాద్ రోడ్డు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడాకారుల అవసరాల కోసం రూ.20 వేల నగదును అందజేశారు. విద్యార్థులకు శిక్షణనిస్తున్న పీఈటీ మధును అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ ఎంవీఐలు వివేకానంద రెడ్డి, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం