
ప్రజావాణికి 121 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు వివరించారు. ప్రజావాణికి వచ్చే వినతులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గోదావరి బ్రిడ్జి గోడ ఎత్తు పెంచాలి..
నవీపేట: యంచ శివారులోని గోదావరి నది బ్రిడ్జికి రెండు వైపుల ఉన్న గోడల ఎత్తును పెంచాలని గ్రామస్తులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం సమర్పించారు. ఎత్తు తక్కువగా ఉండడంతో నదిలో దూకి తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. ఆత్మహత్యల నివారణకు బ్రిడ్జి సమీపంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సెక్యూరిటీ గార్డులను నియమించాలని కోరారు.