సబ్సిడీ జీలుగ విత్తనాల పంపిణీ
డిచ్‌పల్లి: మండలంలోని డిచ్‌పల్లి, బర్ధిపూర్ సొసైటీల ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సొసైటీల చైర్మన్లు రాంచందర్, రామకృష్ణ మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన తర్వాతే రైతులు జీలుగ విత్తనాలను నాటుకోవాలని సూచించారు. జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్సులతో సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు సతీశ్, అశ్రిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గ్యానాజీ గంగారెడ్డి, దేవకరుణ, నాయకులు పి శ్రీనివాస్, గంగాధర్, నర్సయ్య, న్యాస రాజేశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.
నేడు సిరికొండలో..
సిరికొండ: సిరికొండ తూంపల్లి సొసైటీలో గడ్కోల్ సెల్ పాయింట్‌లో జీలుగ విత్తనాలను శనివారం పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య శుక్రవారం తెలిపారు. జీలుగ విత్తనాలు కావాల్సిన వారు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


