
ఇళ్లలో కూర్చుని లబ్ధిదారుల ఎంపిక
నిజామాబాద్‌అర్బన్: కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో కూర్చుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారని, డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవో నంబర్ 7 ప్రకా రం గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, జిల్లాలో ఎక్కడా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెల లు అయినా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు అందించలేదన్నారు. జిల్లాలో లక్షా 80వేల మంది పేదలు దరఖాస్తు చేసుకుంటే 70 వేల మందిని ఎంపిక చేశారని, నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చే యాలని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామన్నా రు. రాజీవ్‌యువవికాస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.4 లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కాంగ్రెస్ కా ర్యకర్తలనే అర్హులుగా గుర్తించి ఇవ్వబోతోందని ఆ రోపించారు. వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ నే తలు జేబులు నింపుకునేందుకు ఈ పథకం తీసుకవచ్చినట్లు విమర్శించారు. గ్రామసభలు పెట్టకుండా నిర్వహించినట్లు అధికారులు రికార్డుల్లో రాస్తున్నా రని దీనిపై ఉన్నతాధికారులకు విన్నవిస్తామన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన కొనసాగుతోందని, పదిలక్షల మెట్రిక్‌టన్నుల సేకరించాల్సి ఉండ గా, ఏడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు సేకరించా రన్నారు. 17 వేల మెట్రిక్‌టన్నులను తరుగుకింద తీసివేస్తున్నారని, రైస్‌మిల్లర్లు దోచుకుంటున్నారని కలెక్టర్ దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం లే దన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకా శ్, సూదం రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలు లేకుండా ఎలా చేస్తారు..
నిబంధనలు పాటించకుంటే
కోర్టులను ఆశ్రయిస్తాం
కాంగ్రెస్ కార్యకర్తలకే
‘యువ వికాస్’ అందించే యత్నం
ధాన్యం సేకరణలో
ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి