
సెల్‌ఫోన్ల చోరీ.. రెండేళ్ల జైలు
కామారెడ్డి క్రైం : ఓ ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండ్ల రాజు ఇంట్లో 2016 మే 8న వేకువ జమున చోరీ జరిగింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తిని కామారెడ్డి పట్టణానికి చెందిన సద్దుల శంకర్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి సుధాకర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.