పనులు నాణ్యతగా చేయించుకోవాలి
వర్ని: అభివృద్ధి పనులను గ్రామస్తులు దగ్గరుండి నాణ్యతగా చేయించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పనులు జరిగే సమయంలో అందుబాటులో ఉండి నిబంధనల ప్రకారం నాణ్యతగా పనులు చేయించాలని సూచించారు. నాణ్యతకు తిలోదకాలిస్తే కాంట్రాక్టర్‌తోపాటు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సాయిలు, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి


