
విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి
సుభాష్‌నగర్ : విద్యుత్ పనులు చేసే సమయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ సూచించారు. నగరంలోని వర్నిరోడ్‌లో ఉన్న పవర్‌హౌస్ సమావేశపు హాల్‌లో ఏఎల్‌ఎం మహేందర్ అకాల మరణానికి సంతాపం వ్యక్తంచేస్తూ శుక్రవారం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ రవీందర్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని తెలిపారు.
ఉద్యోగులు, సిబ్బంది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విద్యుత్ పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈలు ఎం శ్రీనివాస్, రమేశ్, వెంకటరమణ, ఏవో శ్రీనివాస్, జేఏసీ నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్, కాశీనాథ్, సురేశ్ కుమార్, శ్రీధర్, రాజేందర్, నగేశ్ కుమార్, చంద్రశేఖర్, చెన్నయ్య, పవర్‌హౌస్ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్