
సనాతన ధర్మాన్ని పాటించాలి
నందిపేట్(ఆర్మూర్): హిందువులంతా సనాతన ధర్మాన్ని పాటించాలని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి అన్నారు. నందిపేటలోని రామనగర్‌లో నూతనంగా నిర్మించిన రామాలయంలో శుక్రవారం కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో హంపీ పీఠాధిపతి కరకములచే యంత్ర, మూర్తి, శిఖర, ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద పండితులతో ప్రాణ ప్రతిష్ఠ, శాంతి ప్రతిష్ఠ హోమములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాంతి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. హంపీ పీఠాధిపతి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో శ్రేష్టమైనవని, ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సనాతన ధర్మాన్ని పాటించాలి