
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
● సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని సీపీ సాయిచైతన్య అన్నారు. శుక్రవారం నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించారు. సీసీ కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, సౌత్ సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు వెంకట్ రావు, శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు.