
డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీ
ఇందల్వాయి: జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో వైద్య సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తు కారాం రాథోడ్ మాట్లాడుతూ..ప్రజలు డెంగీ వ్యాధి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్‌ఈవో శంకర్, ఆయుష్ వైద్య అధికారి భువన తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ అరుణ లత, హెల్త్ సూపర్‌వైజర్ భూలక్ష్మి, సిబ్బంది పద్మ, మురళి, సురేశ్, సంతోష్, వాజిద్, నరేందర్, లత, పద్మ, పూజా, మల్లేశ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.