భావ్‌సర్‌లు | - | Sakshi
Sakshi News home page

భావ్‌సర్‌లు

May 19 2025 2:40 AM | Updated on May 19 2025 2:40 AM

భావ్‌

భావ్‌సర్‌లు

ఇందూర్‌లో

బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశంగా అవతరించాలని భారత ప్రజలు ముఖ్యంగా భావ్‌సర్‌(రంగరి) క్షత్రియులు బలంగా కోరుకుంటున్నారు. బలూచ్‌ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలుగుతుందని ఆశించడమే అందుకు ప్రధాన కారణం. విభజన సమయంలో బలూచ్‌ ప్రాంతాన్ని వీడి వచ్చిన భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇందూరులో వేయి కుటుంబాలకు పైగా ఉండగా, వారుతమ ఆరాధ్య దైవం హింగులా మాత ఆలయాన్ని నిర్మించి ప్రత్యేకంగా కొలుస్తున్నారు.

ఇందూరులోని ఆలయంలో

హింగులాంబిక

అమ్మవారు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కన్నా ఎక్కువగా ఆ దేశానికి నైరుతిభాగంలో ఉన్న బలూచిస్తాన్‌ అంశంపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు బలూచిస్తాన్‌ తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, భారతదేశంలోని ప్రతిఒక్కరూ ప్రత్యేక బలూచిస్తాన్‌ దేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్‌ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిన భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ వారు మాత్రం మరింత ఆసక్తిగా, బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశంగా అవతరించా లని బలంగా కోరుకుంటున్నారు. తమ మూల స్థానమైన బలూచ్‌లో కొలువై ఉన్న హింగులా మా తను మొక్కుకుంటున్నారు. అఖండ భారత్‌లో భాగమైన బలూచ్‌ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలగాలని కోరుకుంటున్నారు. అమ్మవారి 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగులాదేవి ప్రధాన ఆలయం పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌లోని హింగోల్‌ నేషనల్‌ పార్క్‌లో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుల పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగుళా మాత అసలు పేరు కోట రి. హింగుల పర్వతంపై ఉండడంతో హింగుళాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వతంపై గుహలో హింగులామాత నిత్యం జ్వలి స్తూ దర్శనమిస్తోంది. ప్రకృతి నిర్మిత గుహ ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగులాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన శక్తిస్వరూపిణి ఆలయాన్ని ఇందూరు నగరంలో భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ (రంగరి) (వస్త్రాలకు రంగులు వేసే) ఆధ్వర్యంలో 1982లో నిర్మించారు.

ఇందూరులోని హింగులా మాత ఆలయంలో ప్రతిరోజూ అభిషేకం, ప్రతి మంగళవారం భజనలు, ప్రతి పౌర్ణమికి యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం నిర్వహిస్తున్నారు. దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇందూరులో ఊరపండుగ అయ్యాక వారం రోజుల తరువాత పసుపు, కుంకుమ, కాగడాలతో పాటలు పాడుతూ గోందాల్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

గుండెల్లోనే హింగులామాత

హింగులా మాత శక్తిపీఠం భౌతికంగా భారతదేశానికి బయట ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక శ్రద్ధా చింతనల దృష్ట్యా అమ్మవారు అందరి గుండెల్లో కొలువై ఉన్నారు. ఇది హిందూ ధర్మంలోని శక్తితత్వానికి, భక్తి బలానికి నిలువుటద్దం. బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవిస్తే భారతీయులందరూ హింగుళా మాత శక్తిపీఠాన్ని ఎప్పుడంటే అప్పుడు దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇది భారతీయులందరికీ మరింత హర్షదాయకం. – భోక్రే నారాయణ,

భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ సభ్యుడు

ఆలయంలోని ధ్వజస్తంభం

ఇందూరు హింగుళా మాత

నగరంలో హింగులామాతకు ఆలయం భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో 1982లో నిర్మాణం

దేశ విభజన సమయంలో ఇక్కడికి రాక ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో హింగులా శక్తిపీఠంపై ఆసక్తి

బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశం కావాలని బలంగా కోరుకుంటున్న ప్రజలు

శిరోపీఠంగా ప్రసిద్ధి

హింగులా మాత కొలువై ఉన్న ప్రాంతం అఖండ శక్తి తరంగాలతో నిండినట్లుగా భావిస్తారు. హింగుళ ప్రాంతంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శిరస్సు పడడంతో ఇది శిరోపీఠంగా ప్రసిద్ధి చెందింది. హింగుల పర్వతంలోని గుహ ఆలయంలో ప్రతిష్టిత విగ్రహం లేదు. అక్కడ ఉన్న శిల అమ్మవారి శక్తి స్వరూపంగా భావించబడుతోంది. భక్తులు ఆ శిలపై చందనం, కుంకుమతో పూజలు చేస్తున్నారు. అలాగే ముస్లింలు, జిక్రీ మతస్తులు పూజలు చేస్తున్నారు. వారు హింగులా (హింగ్లాజ్‌) మాతను ‘నానీ మాంఘే’ అని గౌరవంగా పిలుచుకుంటారు.

– మైస్కర్‌ విజయలత చంద్రకాంత్‌ బరిడే, భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ అధ్యక్షురాలు, ఇందూరు

దేశవిభజన సమయంలో ఇక్కడికి..

దేశవిభజన సమయంలో రంగరి (భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌) కులస్తులు బలూచిస్తాన్‌ ప్రాంతం నుంచి రాజస్తాన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఈ సమాజ్‌ కు చెందిన వేయికి పైగా కుటుంబాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరగా హింగులాదేవి కాపాడి వస్త్రాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్‌ పెద్దలు తెలిపారు.

భావ్‌సర్‌లు 1
1/6

భావ్‌సర్‌లు

భావ్‌సర్‌లు 2
2/6

భావ్‌సర్‌లు

భావ్‌సర్‌లు 3
3/6

భావ్‌సర్‌లు

భావ్‌సర్‌లు 4
4/6

భావ్‌సర్‌లు

భావ్‌సర్‌లు 5
5/6

భావ్‌సర్‌లు

భావ్‌సర్‌లు 6
6/6

భావ్‌సర్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement