
అక్రమ నిర్మాణాలను తొలగించాలి
నిజామాబాద్ సిటీ: రోడ్డును ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. డివిజన్ 28, 60, 4, 18 డివిజన్లలో పనులను తనిఖీ చేశారు. సర్కిల్–3లో పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెత్త నిల్వ లేకుండా చూడాలని సూచించారు. డి54 కెనాల్‌లో జరుగుతున్న పూడిక తీత పనులు, మాధవనగర్, కంఠేశ్వర్, లక్ష్మిప్రియనగర్, పాంగ్ర, బోర్గాం, అర్సపల్లి, ఖిల్లా చౌరస్తా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. నగర పరిధిలో వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వకాకుండా మురుగు కాలువలను శుభ్రపరచాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఎంసీ జయకుమార్, సూపర్‌వైజర్ సాజిద్ అలీ, ఇన్‌స్పెక్టర్లు మహిపాల్, షాదుల్లా, సునీల్ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్
పారిశుధ్య పనుల పరిశీలన

అక్రమ నిర్మాణాలను తొలగించాలి