
భక్తిశ్రద్ధలతో సంకష్టహర చతుర్థి పూజలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని గణపతి ఆలయాల్లో సంకష్టహర చతుర్థిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సార్వజనిక్ గణేష్ మండలి, మహాగణపతి ఆలయం, గాయత్రినగర్‌లోని సిద్ధివినాయక స్వామి దేవాలయం, బోర్గాం శివారులోని శ్రీలక్ష్మీ గణపతి మహా ఆలయంలో, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న శుభం కరోతి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా పంచామృతాభిషేకం, గరికపూజ, సింధూరం సమర్పణ చేశారు. అలాగే బోర్గాం శివారులో నెలకొన్న లక్ష్మీగణపతి మహా ఆలయంలో మూల విగ్రహానికి నవవిధ వస్తువులతో ప్రత్యేక ఉపనిషత్తులతో అభి షేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అరుణ్ కుమార్ శర్మ, చిలుముల భూషణ్‌చారి, చిటిమెల్ల హరిప్రసాద్ గుప్తా, అర్చకులు సంజయ్‌శర్మ, అమందు శ్రీనివాస్, కొరడి భూపాల్, బుస్సాపూర్ శంకర్, వెంకట్రాములు, మారుతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.