
టీఎన్జీవోస్‌లో కారు రగడ
నన్నే ప్రశ్నిస్తారా?
కారు కొనుగోలు విషయమై ఉద్యోగులు ప్రశ్నించడంపై అధ్యక్షుడు పలుమార్లు సమావేశంలో హెచ్చరించినట్లు తెలిసింది. రాష్ట్ర నాయకుల అనుమతి తీసుకొని కారు కొనుగోలు చేశానని, దీనిపై ఉద్యోగులు ప్రశ్నించొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో కార్యవర్గం మొత్తం రాష్ట్ర నాయకులను కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా టీఎన్జీవోస్ నిబంధనల ప్రకారం ఈసీ తీర్మానం లేకుండా అధ్యక్ష, కార్యదర్శులు ఎలాంటి కొనుగోళ్లు, ఖర్చులు చేయొద్దు. కానీ, ప్రస్తుతం టీఎన్జీవోస్‌లో కొనుగోలు, ఖర్చు చేసిన తర్వాతే సమావేశాల్లో వివరాలు వెల్లడిస్తున్నారు. లిఖిత పూర్వకంగా ఖర్చుల వివరాలు అందించకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
నిజామాబాద్ అర్బన్: టీఎన్జీవోస్‌లో కారు కొనుగోలు రగడ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లే నివిధంగా జిల్లాలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు సభ్యత్వ రుసుము నిధులతో కారు కొనుగోలు చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సమ స్యలపై పోరాటానికి, కార్యవర్గ బలోపేతానికి ఉపయోగించాల్సిన నిధులతో వాహనం కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈసీ మీటింగ్‌లోనూ కారు కొనుగోలుపై చర్చ కొనసాగింది.
సమాచారం లేకుండానే..
జిల్లాలో వివిధ శాఖల నుంచి టీఎన్జీవోస్‌లో 10,473 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో ఒక్కో ఉ ద్యోగి సభ్యత్వ రుసుము రూపంలో రూ.200 చొ ప్పున డబ్బులు చెల్లిస్తారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ చౌరస్తాలోని సంఘ భవనంలో కొనసాగుతున్న హోటల్, ఇతర దుకాణాల నుంచి నెలకు అద్దె రూ పంలో రూ.4 లక్షల ఆదాయం సమకూరుతోంది. కాగా, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రెండు నెలల క్రి తం టీఎన్జీవోస్ నిధులు రూ. 34 లక్షలతో నూతన కారును కొనుగోలు చేశారు. మొదట రూ.9 లక్షలు చెల్లించి, మిగతా డబ్బులను విడతల వారీగా చెల్లింపులకు నిర్ణయించారు. దీని ప్రకారం నెలకు రూ. 40వేలు టీఎన్జీవోస్ నుంచి చెల్లిస్తున్నారు. కాగా, ఈ విషయమై ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. తీరా కొనుగోలు చేసిన తర్వాత తెలపడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర నాయకుడొకరు అధ్యక్షుడిని ప్ర శ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా టీ ఎన్జీవోస్ సొంత కారు కొనుగోలు చేయకుండా, కేవలం నిజామాబాద్‌లోనే కారు ఎలా కొనుగోలు చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
సంఘం నిధులు రూ.34 లక్షలతో
కొనుగోలు
సభ్యత్వ నిధుల వినియోగంపై
ఉద్యోగుల మండిపాటు