బీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట
నిజామాబాద్ రూరల్: కవిత, కేటీఆర్, హరీశ్‌రావు పోరుతో బీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. వారి పోరుతాళలేక కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోసం ఆరాటపడుతుందని ఎద్దెవా చేశారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న ముడు ముక్కలాట పోరు తాళలేక కేసీఆర్ ఫాం హౌస్‌కు పరిమితం అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్ కనపడదన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. పాక్‌పై యుద్ధంతో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అన్న విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు దిగజారి కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ తరహాలో సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చట్టం తెచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస సీనియర్ నాయకులు మునిపల్లి సాయారెడ్డి, విపుల్‌గౌడ్ తదితరులు పాలొన్నారు.
మతం పేరుతో బీజేపీ రాజకీయ
లబ్ధి పొందుతోంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
మహేశ్‌కుమార్ గౌడ్


