తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

May 17 2025 6:57 AM | Updated on May 17 2025 6:57 AM

తైక్వ

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

నిజామాబాద్‌నాగారం: తైక్వాండోలో బ్లాక్‌బెల్టులు సాధించిన క్రీడాకారులకు జిల్లా జడ్జి భరతలక్ష్మి చేతుల మీదుగా బాక్లబెల్టులను శుక్రవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జడ్జి క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో ప్రధాన కార్యదర్శి, కోచ్‌ మనోజ్‌ కుమార్‌, గంగాధర్‌, గోపికష్ణ, రిత్విక, భవ్య శ్రీ, ప్రవస్తిక, తనిష్క్‌, కోచ్‌ మనోజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే

పిల్లలను చేర్పించాలి

మోపాల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని సిర్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం వి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని సిర్‌పూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న ప్రదేశానికి వెళ్లి తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, తదితర అంశాలను వివరించారు. అదేవిధంగా ముదక్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్‌, పుష్ప, ప్రేమ్‌లాల్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలపై

చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్‌ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డీఈవో కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రఘురాం, అంజలి, నవీన్‌ కృష్ణ, రమేశ్‌, కార్తిక్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

బస్టాండ్‌ను తనిఖీ చేసిన డీఎం

సిరికొండ: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను నిజామాబాద్‌–1 డిపో మేనేజర్‌ బీఎస్‌ ఆనంద్‌ శుక్రవారం తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులకు, విద్యార్థులకు పెన్నులను బహూకరించారు. కంట్రోలర్‌ లింగం ఉన్నారు.

ఉపాధ్యాయులకు

కొనసాగుతున్న శిక్షణ

మోపాల్‌: నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణితం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు 4వ రోజు శిక్షణ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు షీ టీమ్‌ బృందం, హెల్త్‌ ఎడ్యుకేటర్లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ స్వామి సులోచన బాలికల్లో కౌమార దశ మార్పులు, పౌష్టికాహారం, లైంగిక వేధింపులు, జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ సుభాష్‌ పలు అంశాలపై వివరించారు. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు సూచించారు. అలాగే ట్రైనింగ్‌ తరగతులు పరిశీలించారు. కోర్సు సెంటర్‌ ఇన్‌చార్జి, పాఠశాల హెచ్‌ఎం శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాధితుడికి ఎల్‌వోసీ అందజేత

ఇందల్వాయి:మండలంలోని గన్నారం గ్రామా నికి చెందిన మేదరి భూమేశ్వర్‌ వెన్నుపూస సమస్యతో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వారి కుటుంబ సభ్యులు రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. చికిత్స కోసం డబ్బులు లేనందున వారికి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సకు అవసరమయ్యే సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి డబ్బులు ఇప్పించడానికి రూ.4 లక్షల ఎల్‌వోసీ కాపీని ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

తైక్వాండో క్రీడాకారులకు  బ్లాక్‌బెల్టుల ప్రదానం
1
1/4

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

తైక్వాండో క్రీడాకారులకు  బ్లాక్‌బెల్టుల ప్రదానం
2
2/4

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

తైక్వాండో క్రీడాకారులకు  బ్లాక్‌బెల్టుల ప్రదానం
3
3/4

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

తైక్వాండో క్రీడాకారులకు  బ్లాక్‌బెల్టుల ప్రదానం
4
4/4

తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement