ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

May 17 2025 6:57 AM | Updated on May 17 2025 6:57 AM

ఇందిర

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

మోపాల్‌: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎంపీడీవో రాములు నాయక్‌ సూచించారు. మోపాల్‌ మండలంలోని బాడ్సి, అమ్రాబాద్‌, కులాస్‌పూర్‌, న్యాల్‌కల్‌, వడ్డెర కాలనీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మార్కింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా బేస్‌మెంట్‌ లెవల్‌ పనులు పూర్తయిన వెంటనే తొలి విడత బిల్లులు లబ్ధిదారుల ఖా తాల్లో జమ అవుతాయన్నారు. జీపీ కార్యదర్శులు స్వరూప, కృష్ణవేణి, హనుమాన్‌ రాజ్‌, మల్లేశ్‌, నర్సింహులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సిరికొండలో

సిరికొండ: మండల కేంద్రంతోపాటు చీమనపల్లి, పందిమడుగు గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్‌ నాయకులు పంపిణీ చేశారు. సిరికొండలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు దేగాం సాయన్న, గ్యామ శోభన్‌, రమేశ్‌, దిగంబర్‌, రాము, చీమన్‌పల్లిలో రాజేందర్‌ రెడ్డి, జితేందర్‌ సింగ్‌ శ్రీనివాస్‌, నందిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మునిపల్లిలో..

జక్రాన్‌పల్లి: ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సా యిరెడ్డి పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి, లక్ష్మాపూర్‌, నల్లగుట్ట తండా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సాయిరెడ్డి పంపిణీ చేశారు. మునిపల్లిలో 30, లక్ష్మాపూర్‌లో ఏడుగురు, నల్లగుట్ట తండాలో ఇద్దరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. మునిపల్లి మాజీ సర్పంచ్‌ చిన్న సాయి రెడ్డి, రొయ్యల నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాంపూర్‌లో..

డిచ్‌పల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్ర భుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని డిచ్‌పల్లి ఎంపీడీవో లింగం నాయక్‌ అన్నారు. మండలంలోని రాంపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎంపీడీవో ముగ్గు వేసి భూమిపూజ చేశారు. రాంపూర్‌లో వంద మంది ఇళ్లు లేని లబ్ధిదారులను గుర్తించి ప్రతిపాదనలు పంపించగా అందులో 33 మందికి ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పి శ్రీనివాస్‌, కె గంగాధర్‌, సీహెచ్‌ నర్సయ్య, రాంచందర్‌, దత్తాద్రి, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ధర్మారంలో..

నిజామాబాద్‌రూరల్‌: మండలంలోని ధర్మారం గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకు డు కుమార్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి కార్తీక, నాయకులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి 1
1/2

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి 2
2/2

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement