‘అమ్మపాడే జోలపాట’ ఫేంకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

‘అమ్మపాడే జోలపాట’ ఫేంకు సన్మానం

May 13 2025 12:43 AM | Updated on May 13 2025 12:43 AM

‘అమ్మ

‘అమ్మపాడే జోలపాట’ ఫేంకు సన్మానం

సిరికొండ: ‘అమ్మ పాడే జోల పాట’ గాయని జాహ్నవి కొండూర్‌ గ్రామానికి సోమవారం వచ్చింది. బంధువుల పెళ్లికి వచ్చిన ఆమెను శివాలయం వద్ద పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. జాహ్నవి పాడిన పాట చాలా బాగుందని, హిట్‌ అయిందని అభినందించారు.

నూతన డిగ్రీ కోర్సులు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–2026 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై వేణుప్రసాద్‌ సోమవారం తెలిపారు. బీఎస్సీ(డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌), బీఎస్సీ (హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి గల విద్యార్థులు దోస్త్‌ ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశం పొందాలని తెలిపారు.

రసాయన మందుల

వాడకాన్ని తగ్గించాలి

డిచ్‌పల్లి: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించి సాగు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడాలని కృషి విజ్ఞాన కేంద్రం–రుద్రూర్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని డిచ్‌పల్లి తండాలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు బీవీ రాజ్‌కుమార్‌, స్వప్న మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. విత్తన, పురుగు మందులను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారి శ్రీకాంత్‌, మండల పశువైద్యాధికారి గోపికృష్ణ, ఏఈవోలు సతీశ్‌, విలాస్‌, రూపేశ్‌, వంశీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

మహిళను కాపాడిన కానిస్టేబుల్‌

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద సోమవారం ఓ మహిళ తాను చనిపోతానంటూ పరుగెత్తడాన్ని గమనించిన స్థానిక వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వెంటనే అప్రమత్తమై నిజాంసాగర్‌ ప్రధాన కాలువ వైపు పరుగెడుతున్న మహిళను పట్టుకొని నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలను రక్షించిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.

‘అమ్మపాడే జోలపాట’  ఫేంకు సన్మానం1
1/1

‘అమ్మపాడే జోలపాట’ ఫేంకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement