
ఈదురు గాలుల బీభత్సం
సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రా మంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలి ఉధృతికి నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 20 స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు, రేకులు లేచిపోయాయి. తన మామిడి తోటలో మామిడి కాయలు రాలిపోయి చెట్లు విరిగిపోయాయయని బొల్లం కిష్టయ్య అనే వ్యక్తి తెలిపారు. పొన్నం దేవయ్య నివాస గుడిసె పైకప్పు, బానావత్ రవి ఇంటి పైకప్పు రేకులు, మాలావత్ హరిలాల్ ఇంటి పైకప్పు రేకులు, శ్రీగాధ నారాయణకు చెందిన పిండి గిర్ని పైకప్పు రేకులు, దాసారపు శంకర్ ఇంటి పైకప్పు లేచిపోయిందని గ్రామస్తులు తెలిపారు.