
సైనికులకు అండగా నిలబడాలి
నిజామాబాద్ రూరల్: దేశ ప్రజలంతా సైనికులకు అండగా నిలబడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ‘మనం సైతం – దేశం కోసం’ నినాదంతో సారంగాపూర్‌లోని హనుమాన్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల అంతానికి భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు తెలిపారు. పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన నడుంబిగించినట్లు పేర్కొన్నారు. యుద్ధంలో పోరాడుతున్న సైనికులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను కల్పించాలని, భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని పూజలు చేశామన్నారు. ఆయన వెంట పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బీజేపీ నాయకులు ఉన్నారు.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతుంది
ఎంపీ అర్వింద్ ధర్మపురి