
గుర్తింపు కార్డులు అందజేయాలి
ఖలీల్‌వాడి: భవన నిర్మాణ కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు అందించాలని ఎకై ్సజ్ కోర్టు జడ్జి హరికుమార్ అన్నారు. జిల్లా కోర్టులోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బుధవారం న్యాయవిజ్ణాన సదస్సు నిర్వహించగా, జడ్జి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు తప్పనిసరిగా పింఛన్ అందేలా చూడాలన్నారు. అనంతరం లేబర్ ఆఫీసర్ యోహాన్ లేబర్ చట్టాలను వివరించారు. 60 ఏండ్లు నిండిన భవననిర్మాణ కార్మికులకు పింఛన్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో బార్ కార్యదర్శి మాణిక్‌రాజ్, న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.