
‘సాంకేతికతను పరిచయం చేసిన ఘనుడు రాజీవ్ గాంఽఽధీ’
సుభాష్‌నగర్: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా నగరంలోని వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డితోకలిసి ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని, గ్రామీణ విద్యాభివృద్ధిని ప్రోత్సహించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు రాంభూపాల్, కాంగ్రెస్ ఫిషర్‌మన్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, నరేందర్ గౌడ్, రామకృష్ణ, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానం
బోధన్: పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డులోని లక్ష్మి అపార్టుమెంట్ నివాసీ ఎన్ రమేశ్(59) బుధవారం మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులు రమేశ్ నేత్రాలు దానం చేయాలని నిర్ణయించుకొని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి రెండు కళ్లను వైద్యులు సేకరించారని లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు పోలవరపు బసవేశ్వర్ రావు తెలిపారు.
సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5.80 లక్షలు రికవరీ
● పోలీసులకు కృతజ్ఞతలు
తెలిపిన బాధితుడు
కామారెడ్డి క్రైం: ఓ వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేస్తూ పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడి అతని అకౌంట్లో నుంచి రూ.5.80 లక్ష లు సైబర్ నేరగాళ్లు కాజేయగా, వెంటనే స్పందించి డబ్బులు మొత్తం రికవరీ చేశారు కామా రెడ్డి పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన లోకుల రాజేందర్ అనే వ్యక్తికి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. తాము ముంబై పోలీసులమని నమ్మించారు. టెలికాం సర్వీస్ ద్వారా మీ ఆధార్ కార్డుతో మరొకరు డబ్బులు తీసుకున్నారని, మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయభ్రాంతులకు గురిచేశారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం తమ అకౌంట్‌కు బదిలీ చేయాలని, లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయపడిన రాజేందర్ తన అకౌంట్లోని రూ.5.80 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అనుమానం వచ్చి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పట్టణ ఎస్‌హెస్‌వో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సదరు బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసి, డబ్బులు రికవరీ చేసి బాధితుని అకౌంట్లో జమ చేశారు. దీంతో బాధితుడు రాజేందర్ పట్టణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.