పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
నిజామాబాద్
అధ్వానంగా ఆటోనగర్
నగర శివారులోని ఇండస్ట్రియల్ కారిడార్ ఆటోనగర్‌ను పట్టించుకునే వారు లేక అధ్వానంగా తయారైంది.
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
– IIలో u
అంకాపూర్‌వాసికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాదేవి యూ త్ అసోసియేషన్ అధ్యక్షుడు కే వినోద్ రెడ్డికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్‌లో చోటు లభించింది. అంకాపూర్ గ్రామంలో గురడి రెడ్డి కాపు సంఘంలో వినోద్ రెడ్డి శుక్రవారం క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ కారు రేసు, బాక్సింగ్, హాకీ క్రీడలకు సంబంధించిన 1,400 ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా కోర్డినేటర్లు బింగి నరేందర్ గౌడ్, అనిల్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. వినోద్ రెడ్డి సేకరించిన ఫొ టోలను రికార్డుగా గుర్తించి బంగారు పతకంతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ కోర్డినేటర్ రాజు, గురడి రెడ్డి కాపు సంఘం అధ్యక్షుడు సల్ల అనంతు, ఉపాధ్యక్షుడు నారాయణ, సాగర్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాల కేంద్రం పరిశీలన
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని పాఠ్య పుస్తకాల కేంద్రాన్ని డీఈవో అశోక్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాకు ఇంకా ఎన్ని పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది అనే విషయాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పాఠ్య పుస్తకాలను వెంటవెంటనే మండల కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సకాలంలోనే పాఠ్య పుస్తకాలను అందిస్తామని పేర్కొన్నారు.
డ్రోన్ల వినియోగానికి అనుమతి తప్పనిసరి
● సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: డ్రోన్ల వినియోగానికి తప్పనిసరిగా అనుమతి తీ సుకోవాలని సీపీ సా యిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని సూచించారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయొద్దని, రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రివేళ్లలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలపై పూర్తిగా నిషేధం ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో ఊరేగింపులు, బహిరంగ సభలపై నిషేధం ఉందని, సభలు, సమావేశాలకు పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఈనెల 31 వరకు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు. ప్రజలు గల్ఫ్ ఏజెంట్లను నమ్మవద్దని, వారికి ఇండ్లు, ఆఫీసులకు అద్దెకు ఇస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కల్తీకల్లు కోసం ఉపయోగించే రసాయనాలు, కల్లు తయారీదారులను పట్టుకునే విషయంలో అధికార యంత్రాంగం విచిత్రంగా వ్యవహరిస్తోంది. భారీ స్థాయిలో రసాయనాలను సరఫరా చేస్తున్న వా రిని, తక్కువ ధరకు లభించే డ్రగ్స్ ను కల్లు తయారీకి ఉపయోగించేలా ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలేసి కల్లు సొసైటీ సభ్యులుగా ఉండి చిన్నపాటి డిపోలను నిర్వహిస్తున్న తమపైనే ప్రతాపం చూపిస్తున్నారని గౌడ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు చేస్తూ భారీగా రసాయనాలను రవాణా చేస్తున్న వారిని వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా తమను ఇబ్బందులపాలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేసుల లెక్కల కోసం ఇలా చేయడం సరికాదంటున్నారు.
కల్లుపై ప్రయోగాలు
కృత్రిమ కల్లును గతంలో క్లోరోహైడ్రేట్ రసాయనంతో తయారు చేసేవారు. ప్రభుత్వం నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కల్లు తయారీకి అల్ప్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఈ రసాయనాలు సాధారణంగానే అత్యంత ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, కిడ్నీ, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఇక మోతాదు పెంచితే తాగినవాళ్లు కుప్పకూలాల్సిందే. కాగా ఈ రసాయనాల కొ నుగోలు ఖర్చును మరింతగా తగ్గించుకొని, అధిక లాభాలను ఆర్జించేందుకు కొందరు బడా ముదుర్లు కల్లుప్రియులపై ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి బడా ముదుర్లను వదలి తమపై అధికార యంత్రాంగం ప్రతాపం చూపడంపై కల్లు సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్లో అల్ప్రాజోలం రసాయనాన్ని సరఫరా చేస్తున్న వారి ని పట్టుకోవడం మాని కేవలం రెండు నుంచి మూ డు కిలోలు తెచ్చుకుంటున్న తమపై కేసులు నమో దు చేసి ఉన్నతాధికారుల వద్ద జిల్లా అధికారులు మెప్పు పొందుతున్నారని సొసైటీల సభ్యులు చెబుతున్నారు. అల్ప్రాజోలం విషయానికొస్తే ఉమ్మడి జిల్లాలో 2023లో 6.4 కిలోలు, 2024లో 9.6 కిలోలు, 2025లో ఇప్పటి వరకు 0.25 కిలోలు మా త్రమే పట్టుకోవడం గమనార్హం. ఇదంతా గమనిస్తే బడా ముదుర్లను మాత్రం వదిలేస్తున్నట్లు అర్థమవుతోందని సొసైటీల సభ్యులు అంటున్నారు.
● ఇప్పటి వరకు 7.92 లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
● మరో 40 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం
● మంత్రుల వీసీలో కలెక్టర్
రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడి
న్యూస్‌రీల్
రసాయనాల బదులు..
కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో గతనెల 7వ తేదీన కల్లుడిపోలో కల్లు తాగిన 69 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్ జీజీహెచ్‌లో 72 గంటలపాటు వైద్య చికిత్సలు అందించారు. చికిత్స సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా(మరమనిషి మాదిరిగా), రిజిడ్(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు తదితర లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను వాడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ యాంటీ సైకోటిక్ గ్రూపులోని డ్రగ్స్‌ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ పేషెంట్‌ను కామ్‌డౌన్ చేస్తుంది. అయితే యాంటీ సైకోటిక్ గ్రూపులో క్లోర్‌ప్రామజిన్ లాంటి మరో ఐదురకాల డ్రగ్స్ ఉంటాయి. ఇలా రసాయనాల బదులు కొత్త రకం డ్రగ్స్‌తో కల్లు ప్రియులపై ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలి అధికారులు తమపై ప్రతాపం చూపుతున్నారని సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృత్రిమ కల్లు తయారీలో కల్లు సొసైటీలపైనే
అధికారుల ప్రతాపం
కొత్త రకం డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న
మాఫియాకు మినహాయింపు
‘యాంటీ సైకోటిక్ డ్రగ్స్’ వాడకాన్ని
ప్రోత్సహిస్తున్న ముదుర్లు
తక్కువ ఖర్చుతో లభించే రసాయనాల
వైపు కొందరి చూపు
అధికారుల తీరుపై విమర్శలు
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!


