
టీకాలకు సర్వం సిద్ధం
నిజామాబాద్‌నాగారం: వ్యాధి నిరోధక టీకాలు తీసుకోని ఐదేళ్ల లోపు పిల్లలు, డ్రాప్ అవుట్ పిల్లలతోపాటు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జిల్లాలో 705 శిబిరాలను ఏర్పాటు చేసి టీకాలు వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గర్భిణులు 409 మంది, పిల్లలు 2569 మందికి టీకాలు వేయనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా 12 టీకాల శిబిరాలను హైరిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో అంగన్‌వాడీ ఆయాలు పిల్లలను, గర్భిణులను టీకాల కేంద్రాలకు తరలిస్తే, ఏఎన్‌ఎంలు టీకాలు ఇస్తారు.
డీఐవో పర్యవేక్షణ చేయాలి
జిల్లాలో 225 సబ్‌సెంటర్లు, 27పీహెచ్‌సీ, 07సీహెచ్‌సీ, 10 యుపీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి(ఆర్మూర్), జిల్లా ఆస్పత్రి(బోధన్), జీజీహెచ్ తదితర ఆస్పత్రులున్నాయి. వీటి పరిధిలో 705టీకాల శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఐ(జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి) పర్యవేక్షించనున్నారు. వీరితోపాటు ఆయా డివిజన్‌ల డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సైతం పరీశీలించనున్నారు.
నేటి నుంచి 28వ తేదీ వరకు..
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి
ఐదేళ్ల పిల్లలు.. గర్భిణులకు
ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
ప్రతి ఒక్కరికీ టీకాలు ఇవ్వాల్సిందే
జిల్లాలో ఐదేళ్ల వయస్సు వర కు పిల్లలకు నెలవారి, ఆరు నెలల, ఏడాది టీకాలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. డ్రాప్ అవుట్ పిల్లలను ఇప్పటికే గుర్తించాం. జరిగింది. ఈ నెల 21 నుంచి 28వరకు పిల్లలందరికీ కచ్చితంగా టీకాలు వేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. – రాజశ్రీ, డీఎంహెచ్‌వో