
వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని సోమవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంలో ఊరేగించారు.
కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, శ్రీధర్ రావు,అర్చకులు డైరెక్టర్లు లక్ష్మి రాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు.