సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ: నగర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని ఖిల్లా చౌరస్తా వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి రాములు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల డ్రైవర్‌లను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ సెక్షన్ 106(1(2)ను రద్దుచేయాలన్నారు. ఈ ప్రమాదాల్లో డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే సెక్షన్‌లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రవాణారంగ కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు సయ్యద్ రఫీయుద్దిన్, సయ్యద్ ఇర్ఫాన్, షేక్ జావిద్, షేక్ మసూద్, షేక్ మజీద్ పాల్గొన్నారు.


