130 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు
నిజామాబాద్‌అర్బన్: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా 130 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి జిల్లాలో ఈ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆర్మూర్‌లో..
ఆర్మూర్: పట్టణంలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించి 14 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపారు. వీరందరినీ ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిలో 9 మందిపై..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో 9 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఎస్సై మహేశ్ గురువారం తెలిపారు.
లింగంపేటలో నలుగురిపై...
లింగంపేట(ఎల్లారెడ్డి): నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


