జిల్లా మరింత పురోగతి సాధించాలి
నిజామాబాద్‌అర్బన్: నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం ఆయా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదనపు కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ,, డీడబ్ల్యూవో రసూల్ బీ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు నాగోరావు, నర్సయ్య, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి.శ్రీనివాస్ రావు, భాస్కర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మానవతా సదన్‌లో నూతన సంవత్సర వేడుకలు
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్‌లో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. సదన్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు నోట్ బుక్స్, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్‌కు సదన్ పిల్లలు తాము చిత్రించిన పార్వతీపరమేశ్వరుని ఫొటో బహూకరించారు. అనంతరం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, సదన్ కేర్ టేకర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
జిల్లా మరింత పురోగతి సాధించాలి


